మహిళా నేతలపై బీజేపీ నిఘా.. మెహబూబా ముఫ్తీ కుమార్తె సంచలన ఆరోపణలు

బుధవారం తన ఫోన్‌ను పెగాసస్ స్పైవేర్ హ్యాక్ చేసిందని ఆమె ఆరోపించారు.

Update: 2024-07-10 16:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పీడీపీ అధ్యక్షురాలు మొహబూబా ముఫ్తీ కుమార్తె, మీడియా సలహాదారు ఇల్తిజా ముఫ్తీ అధికార బీజేపీపై సంచనల ఆరోపణలు చేశారు. బుధవారం తన ఫోన్‌ను పెగాసస్ స్పైవేర్ హ్యాక్ చేసిందని ఆమె ఆరోపించారు. బీజేపీ దేశవ్యాప్తంగా మహిళా నేతలపై నిఘా ఉంచిందని ఆమె ఎక్స్‌లో ట్వెట్ చేశారు. దీంతో మరోసారి పెగాసస్ వ్యవహారం చర్చకు వచ్చింది. 'తన ఫోన్ పెగాసస్ ద్వారా హ్యాక్ అయిందని యాపిల్ అలర్ట్ మెసేజ్ పంపింది. దీన్ని భారత ప్రభుత్వం సేకరించి రాజకీయ ప్రత్యర్థులు, గిట్టనివారిని వేధించేందుకు వాడుతోందని 'ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తమకు అనుకూలంగా లేని మహిళా నేతలను స్నూప్ చేసేందుకు బీజేపీ పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోంది. బీజేపీ ఇంకా ఎంతవరకు దిగజారుతుందోనని ఇల్తిజా ముఫ్తీ విమర్శించారు. కాగా, గతేడాది భారత ప్రభుత్వం హైప్రొఫైల్ జర్నలిస్టులను టార్గెట్‌గా పెగాసస్ స్పైవేర్‌ను వాడుతున్నట్టు వాషింగ్టన్ పోస్ట్, అమెస్టీ ఇంటర్నేషనల్ తమ సంయుక్త నివేదికలో వెల్లడించాయి. తాజాగా మళ్లీ ఈ వ్యవహారం తెరపైకి రావడం గమనార్హం. 


Similar News