దసరా స్పెషల్: రైలు ప్రయాణికులకు శుభవార్త

సరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం స్పెషల్ మెనూ అందుబాటులోకి తీసుకొచ్చింది.

Update: 2022-09-26 10:06 GMT
దసరా స్పెషల్: రైలు ప్రయాణికులకు శుభవార్త
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం స్పెషల్ మెనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. నవరాత్రుల సందర్భంగా రైలులో ప్రయాణించే భక్తుల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రత్యేక మెనూను ప్రకటించింది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వశాఖ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఈ స్పెషల్ మెనూ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు అందించనున్నట్లు పేర్కొంది. దీనిని 'ఫుడ్ ఆన్ ట్రాక్' యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవాలని తెలిపింది. 'ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్ నుండి నవరాత్రి రుచికరమైన వంటకాలను ఆర్డర్ చేయండి. కేటరింగ్‌ను సందర్శించండి. ఐఆర్సీటీసీ లేదా 1323కి కాల్ చేయండి' అని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్‌లో పేర్కొంది. కాగా, దుర్గామాత తొమ్మిది రోజుల ఉత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. 



Tags:    

Similar News