Gold seized: కోల్‌కతాలో ఈడీ దాడులు.. రూ.6కోట్ల విలువైన బంగారం స్వాధీనం

బ్యాంక్ మోసానికి సంబంధించిన కేసులో కోల్‌కతాలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేపట్టారు.

Update: 2024-09-08 12:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బ్యాంక్ మోసానికి సంబంధించిన కేసులో కోల్‌కతాలోని సాల్ట్ లేక్ ప్రాంతంలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు చేపట్టారు. ఈ క్రమంలోనే వ్యాపారవేత్త స్వపన్ సాహా నివాసం నుంచి రూ. 6.5 కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక భారీగా నగదు, ఇతర పత్రాలను పట్టుకున్నట్టు తెలిపారు. బంగారానికి సంబంధించి స్వపన్ సాహా సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకపోవడంతో దానిని సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. మరింత విచారణ కోసం సాహాను ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి పిలిచే అవకాశమున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. బంగారం, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, రశీదులు, బంగారం కొనుగోలు చేసిన డబ్బులు ఎక్కడివి అనే విషయాలపై ఆయనను మరోసారి ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది.


Similar News