జిప్పు విప్పేసి.. నిద్రపోతున్న యువతి ఎదుట హస్తప్రయోగం
దిశ, నేషనల్ బ్యూరో : కామం మనిషిని అంధుడిగా మారుస్తుందని చెబుతుంటారు. ఆ యువకుడి విషయంలో అదే జరిగింది.
దిశ, నేషనల్ బ్యూరో : కామం మనిషిని అంధుడిగా మారుస్తుందని చెబుతుంటారు. ఆ యువకుడి విషయంలో అదే జరిగింది.కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి రైలులో నిద్రపోతున్న 22 ఏళ్ల యువతి మొహం ఎదుట నిలబడి సిగ్గు లేకుండా హస్త ప్రయోగం చేసుకున్నాడు. ఈ ఘటన కేరళ నుంచి బయలుదేరిన పూర్ణ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం ఉదయం 7:30 గంటలకు జరిగింది. బాధిత యువతి తన ఇద్దరు మగ స్నేహితులతో కలిసి పూర్ణ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తోంది. కర్ణాటకలోని గోకర్ణ రైల్వే స్టేషన్ సమీపంలోకి రైలు చేరుకోగానే యువతి కూర్చొని నిద్రలోకి జారుకుంది.
కళ్లు మూసుకొని ఉండగా..
ఆమె కళ్లు మూసుకొని ఉండగా.. అటువైపుగా వచ్చిన 47 ఏళ్ల కామాంధుడు యువతి మొహం ఎదుట నిలబడి ప్యాంటు జిప్పు విప్పేసి హస్త ప్రయోగం చేసుకోవడం ప్రారంభించాడు. అతడి పనిని గమనించిన ఆమె స్నేహితులు ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసి కొంకణ్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైలు గోవాలోని మార్గోవ్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే.. పోలీసులు వచ్చి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన దత్తాత్రయ్ చవాన్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు కేరళలోని కన్నూర్‌లో పనిచేస్తున్నాడని దర్యాప్తులో తెలిసింది.