ముద్దులు పెడుతూ కాలేజీలో ర్యాగింగ్ (వీడియో)
బంధించడమే కాకుండా కట్టెలతో బెదిరిస్తూ బలవంతంగా మైనర్ బాలికకు ముద్దులు పెడుతూ...Girl forcibly kissed at college, 5 detained for ragging, harassment
దిశ, వెబ్ డెస్క్: బంధించడమే కాకుండా కట్టెలతో బెదిరిస్తూ బలవంతంగా మైనర్ బాలికకు ముద్దులు పెడుతూ హల్చల్ చేస్తూ కాలేజీ యువకులు ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... సోషల్ మీడియాలో విద్యార్థుల ర్యాగింగ్ కు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఒడిశాలోని గంజాం జిల్లాలోని ఓ కాలేజీకి చెందిన ఫ్రెషర్ మైనర్ బాలికను సీనియర్ విద్యార్థులు వేధించారు. ఆమెను గ్రౌండ్ వద్దకు తీసుకెళ్లి వేధిస్తూ ఓ విద్యార్థి ఆమెకు బలవంతంగా ముద్దులు పెడుతున్న దృశ్యం, అదేవిధంగా పక్కన ఉన్న మిగతా స్టూడెంట్ కూడా చేతిలో కర్ర పట్టుకుని ఆమెను వేధిస్తుండడం, ఇదంతా చూసి పక్కున మిగతా విద్యార్థులు నవ్వుతున్న దృశ్యం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఈ ఘటనలో పాల్గొన్న 12 మంది విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరించారు. అంతేకాదు.. వీరిందరినీ కూడా భవిష్యత్తులో జరిగే పరీక్షలు రాయనీయబోమని కాలేజీ ప్రిన్సిపాల్ స్పష్టం చేసినట్లు అందులో పేర్కొన్నారు.
Ragging and molestation of a girl student in Berhampur Odisha, in front of everyone in broad daylight. And the prime accused was the ruling party BJD's college convener.
— KeepitDope_Suv (@_JoshNeverStops) November 18, 2022
Law & order in the state has gone for a toss! Where are we heading as a society? 😢 pic.twitter.com/i09I7w3bgz