జీడీపీ అంటే అది కాదు.. కొత్త అర్ధం చెప్పిన నిర్మలా సీతారామన్
ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్న తరుణంలో ఇవ్వాళ కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలకు కొద్ది రోజులే ఉన్న తరుణంలో ఇవ్వాళ కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ జీడీపీకి కొత్త అర్ధం చెప్పారు. జీడీపీ అంటే తమ ప్రభుత్వం దృష్టిలో వేరే అర్ధం ఉందని, అది గవర్నెన్స్, డెవలప్ మెంట్, పర్ఫార్మెన్స్ అని కొత్త అర్ధాన్ని తీసుకొచ్చారు. అలాగే దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని, మద్దతు ధర, పెట్టుబడి సాయంతో రైతులను ఆదుకున్నామని తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచడానికి వివిధ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే డెయిరీ రైతుల సమగ్రాభివృద్దికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలియజేశారు.