Gas Leak : ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్.. ముగ్గురు దుర్మరణం
ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మందికి గాయాలయ్యాయి.
దిశ, నేషనల్ బ్యూరో : ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో చోటు చేసుకుంది. సాంగ్లీ జిల్లా కడేగావ్ తహసీల్‌లోని షల్గావ్ ఎంఐడీసీ(మహారాష్ట్ర ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. టెక్నికల్ సమస్య కారణంగా రియాక్టర్ పేలి గ్యాస్ లీక్ అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. గురువారం పాల్గర్ జిల్లాలో ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. థానే జిల్లా దొంబివ్లి వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన రియాక్టర్ బ్లాస్ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో థానే జిల్లా అంబర్‌నాథ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకంది. కెమికల్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది.