గ్యాంగ్‌స్టర్ స్నేహితుడికి స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు! బీజేపీ ఫైర్
కర్ణాటక ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో ప్రచారంలో అన్ని పార్టీలు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా కాంగ్రెస్ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌పై బీజేపీ ఎటాక్ ప్రారంభించింది. కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అష్రఫ్‌ల స్నేహితుడికి చోటు కల్పించారని బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే విమర్శలు గుప్పించారు.
ఈ జాబితాలో ఇమ్రాన్ ప్రతాప్ గర్హి పేరును కాంగ్రెస్ పార్టీ పేర్కొందని ఇతను అతిక్, అష్రఫ్‌కు స్నేహితుడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తుంటే నేరస్థులు, దేశ వ్యతిరేకులకు మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు. మరోవైపు ఎన్నికలకు మరో 20 రోజులు మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.