చరిత్రలో తొలిసారి: గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు

ఓ హత్య కేసులో గ్యాంగ్ స్టర్, మాజీ ఎమ్మెల్యేకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 32 ఏళ్ల క్రితం నాటి కేసులో వారణాసి కోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది.

Update: 2023-06-05 11:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ హత్య కేసులో గ్యాంగ్ స్టర్, మాజీ ఎమ్మెల్యేకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 32 ఏళ్ల క్రితం నాటి కేసులో వారణాసి కోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ కోర్టు దోషిగా తేల్చింది. 1991లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ సోదరుడు అవదేవ్ రాయ్‌ను ముక్తార్ అన్సారీ దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో అన్సారీతో పాటు భీమ్ సింగ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ కలీమ్, మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. అనేక ట్విస్టులు తీసుకున్న ఈ కేసులో చివరికి ముఖ్తార్‌కు శిక్ష ఖరారైంది. 2022లో ఈ కేసుకు సంబంధించిన డైరీ మాయం అయింది. దీంతో డైరీ జిరాక్సుల సాయంతో విచారణ కొనసాగింది. విచారణ అనంతరం ఇవాళ ముక్తార్‌ను జీవిత ఖైదు విధించడంతో పాటు రూ.1 లక్ష జరిమానాను కోర్టు విధించింది. కాగా, జిరాక్స్ పేపర్ల ఆధారంగా ఓ కేసులలో తీర్పు వెల్లడించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే మరో హత్య కేసులో అన్సారీ ప్రస్తుతం 10 ఏళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్నాడు.

Tags:    

Similar News