మణిపూర్‌లో హింసాత్మకం.. నలుగురు కాల్చివేత..?
మణిపూర్‌లో మైటిస్ వర్గీయులకు ఎస్టీ ట్రైబల్ హోదా కల్పించడం తో చెలరేగిన అల్లర్లు నేటికి కోనసాగుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌లో మైటిస్ వర్గీయులకు ఎస్టీ ట్రైబల్ హోదా కల్పించడం తో చెలరేగిన అల్లర్లు నేటికి కోనసాగుతున్నాయి. అల్లర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆ రాష్ట్ర గవర్నర్ కాల్పులకు అనుమతి ఇచ్చారు. దీంతో శుక్రవారం చురచంద్‌పూర్‌లో భద్రతా దళాలు మెయిటీస్‌ను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయిస్తున్నప్పుడు భారీగా అల్లర్లు చెలరేగాయి. దీంతో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఆందోళన కారులు మృతిచెందినట్లు నివేదికలు తెలిపాయి. కొందరు వ్యక్తులు తరలింపును వ్యతిరేకిస్తూ ప్రధాన రహదారిని దిగ్బంధించడంతో కాల్పులు జరిగాయి. అలాగే మరో సాధారణ వ్యక్తి కూడా మరణించినట్లు తెలుస్తుంది.