Bharat Jodo Yatraలో పాల్గొన్న RBI మాజి గవర్నర్

ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్రలో పాల్గోన్నారు. ప్రస్తుతం జోడో యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతుంది.

Update: 2022-12-14 05:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాజస్థాన్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. యాత్రలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. సవాయి మాదోపూర్‌కు చెందిన బడోతీ నుంచి ఇవాళ ఉదయం పాతయాత్ర మొదలైంది. వీరి ఫోటోలను ప్రియాంక గాంధీ ట్విట్టర్ లో షేర్ చేస్తూ బలమైన ఆర్థిక వ్యవస్థ గురించి రఘురామ్, రాహుల్ గాంధీ చర్చించారని పేర్కొంటూ ట్వీట్ చేశారు. వీరిద్దరూ నడుచుకుంటూ, మాట్లాడిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, కన్యాకుమారి నుంచి మొదలైన పాదయాత్ర వచ్చే ఏడాది జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు కాశ్మీర్‌లో భారత్ జోడో యాత్ర ముగియనుంది. ఇప్పటికే ఈ యాత్రలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, పలువురు ప్రముఖులు, సినీ నటులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన జోడో యాత్ర ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మీదుగా యాత్ర సాగింది.

Also Read....

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా? 

Tags:    

Similar News