లేడీ జర్నలిస్ట్‌పైకి కుక్కలను వదిలిన మాజీ మంత్రి.. కేసు నమోదు
కొంత మంది రాజకీయ నాయకుల అవినీతిని వెలుగులోకి తెచ్చే క్రమంలో జర్నలిస్ట్‌లపై ఆ నేతలు వివిధ రూపాల్లో దాడులకు పాల్పడుతున్న ఘటనలు చాలా చూసి ఉంటారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కొంత మంది రాజకీయ నాయకుల అవినీతిని వెలుగులోకి తెచ్చే క్రమంలో జర్నలిస్ట్‌లపై ఆ నేతలు వివిధ రూపాల్లో దాడులకు పాల్పడుతున్న ఘటనలు చాలా చూసి ఉంటారు. తాజాగా కూడా ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో సైలెంట్‌గా అక్రమ కట్టాలను కూల్చివేస్తున్నారు. అది కవరేజీ కోసం వెళ్లిన ఓ లేడీ జర్నలిస్ట్‌పైకి ఓ రాజకీయ నాయకుడు రెండు కుక్కను వదిలిన ఘటన చర్చనీయశంగా మారింది. ఈ ఘటనలో ఒడిశా రాజాధాని భువనేశ్వర్‌లో బీబూ జనతా దళ్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘునందన్ దాస్‌పై మంగళవారం కేసు నమోదు అయింది.
అయితే, బీజేడీ శక్తివంతమైన నాయకుడు ప్రణబ్ ప్రకాష్ దాస్ ప్రభుత్వ క్వార్టర్స్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అదే సమయంలో ప్రముఖ ఒడియా న్యూస్ ఛానెల్ ఆర్గస్ న్యూస్‌కి చెందిన లేడీ జర్నలిస్ట్ చిన్మయి సాహూ ఆ న్యూస్ కవర్ చేయడానికి కెమెరామెన్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. పక్కనే ఉన్న మాజీ మంత్రి రఘునందన్ దాస్ ఇంటి నుంచి కెమెరా కవర్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత కవరేజ్ కోసం మాజీ మంత్రి ఒప్పుకోలేదు. పైగా ఆ స్థలం నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న రెండు కుక్కలను లేడీ జర్నలిస్ట్, కెమెరామెన్‌పైకి వదిలారు. దీంతో వారు భయంతో అరుస్తూ పరిగెత్తారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఘటనపై లేడీ జర్నలిస్ట్ ఫిర్యాదు చేసింది.