Rahul Gandhi in US: జోడో యాత్రలు చేపట్టడానికి కారణం ఇదే..

భారతదేశంలో ప్రజాస్వామ్యం(democracy) విచ్ఛిన్నమైందని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ(Congress MP Rahul Gandhi) అన్నారు.

Update: 2024-09-11 04:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశంలో ప్రజాస్వామ్యం(democracy) విచ్ఛిన్నమైందని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ(Congress MP Rahul Gandhi) అన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. వాషింగ్టన్ డీసీలోని(Washington DC) నేషనల్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. భారత్ జోడోయాత్ర(Bharat Jodo Yatra), భారత్ జోడో న్యాయ్ యాత్రలను(Bharat Jodo Nyay Yatra) చేపట్టడానికి కారణాన్ని వివరించారు. దేశంలో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైందని.. ప్రజాస్వామ్య ప్రక్రియలు పనిచేయకపోవడాన్ని తాను గ్రహించానని అన్నారు. దానికి ప్రతిస్పందనే యాత్రలు అని తెలిపారు. నేరుగా ప్రజలతో మాట్లాడానికి ఇది తప్ప వేరే మార్గం లేదని పార్టీ భావించిందన్నారు. ప్రజలగొంతుకగా మారేందుకు తాను చేసిన ప్రయత్నాల గురించి మాట్లాడారు. దైనందిన జీవితాలను ప్రభావితం చేసే సంక్లిష్ట సమస్యలను అర్థం చేసుకోవడానికి, ముఖ్యంగా వ్యవసాయం, ఆర్థికం,పన్నులు వంటి సమస్యలు, సమాజంలోని వివిధ రంగాల వ్యక్తులతో నేరుగా నిమగ్నమవడానికి నాయకుడు అవసరమని నొక్కి చెప్పారు.

బీజేపీపై విమర్శలు

"రాజకీయంగా ఇలాంటి యాత్ర చేపట్టడం చాలా అవసరం. కానీ వ్యక్తిగతంగా నేను ఎప్పట్నుంచో ఇలాంటి యాత్ర చేపట్టాలనుంకుటున్నా. నేను చిన్నప్పటి నుండి ఏదో ఒక రోజు దేశమంతా నడవాలి. ప్రజలను దగ్గర్నుంచి చూడాలి అని అనుకున్నా ”అని రాహుల్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ అనేది.. భారతదేశ భవిష్యత్ కోసం భిన్నఆలోచన మధ్య జరిగే ఘర్షణే అని అన్నారు. భారత్ లో సైద్ధాంతిక యుద్ధం జరుగుతోందన్నారు. బీజేపీతో పాటు దాని సైద్ధాంతిక మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ లపై (RSS) మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశ ప్రజల హక్కులను కాపాడతాయని, భావప్రకటన స్వేచ్ఛకు అనుమతి ఇస్తాయని అన్నారు. కానీ బీజేపీ మాత్రం కఠినమైన కేంద్రీకృత దృష్టితో వ్యవహరిస్తుందని.. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు భిన్నంగా ఉందని అన్నారు. ఇండియా కూటమి దిశ గురించి రాహుల్ స్పందించారు. బీజేపీ కేంద్రీకృత, నియంత్రత్వ అజెండాకు వ్యతిరేకంగా కూటమి దృష్టి భిన్నంగా ఉంటుందన్నారు.


Similar News