దేశంలోనే తొలిసారి.. 'వారి కోసం' అంతర్జాతీయ యూనివర్సిటీ!
దేశంలోనే తొలిసారిగా అంధుల కొరకు మొట్టమొదటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం జపాన్ లోని సుకుబా యూనివర్సిటీతో ఈ అంశానికి సంబంధించి చర్చలు ప్రారంభించింది.
దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే తొలిసారిగా అంధుల కొరకు మొట్టమొదటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం జపాన్ లోని సుకుబా యూనివర్సిటీతో ఈ అంశానికి సంబంధించి చర్చలు ప్రారంభించింది. సోషల్ సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ( ఎస్ఎస్ఈపీడీ ) విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ బిస్తుపాద సేథీ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తాజాగా ఒడిశా రాష్ట్రానికి వచ్చిన సుకుబా వర్శిటీ బృందంతో ఎస్ఎస్ఈపీడీ అధికారులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే మన దేశంలో మొత్తం 50 లక్షల మందికి పైగా అంధులు ఉండగా, ఒక్క ఒడిశా లోనే 5 లక్షలు ఉన్నారు. వీరిలో యువతనే దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరికి విద్య పరంగా, సాంకేతిక నైపుణ్యం పరంగా తగిన భరోసాను అందించి ఉద్యోగావకాశాలు కల్పించాలనే ముందు చూపుతోనే ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు. వారు ఏర్పాటు చేయబోయే వర్సిటీకి ప్రముఖ కవి, సంఘ సంస్కర్త 'భీమ బోయ్' పేరును పెట్టనున్నట్లు సేథీ అన్నారు. ఈ యూనివర్సిటీ లో.. స్వదేశంలోని విద్యార్థులతో పాటూ విదేశీ విద్యార్థులకు కూడా ప్రవేశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా చెప్పారు.