ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి

దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుుతున్నాయి.

Update: 2025-01-26 05:43 GMT
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుుతున్నాయి. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Draupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకత. వేడుకల్లో ప్రధాని మోదీ(PM Modi), ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, కేంద్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు. ఇక వేడుకల్లో ‘స్వర్ణిమ్‌ భారత్, విరాసత్‌ ఔర్‌ వికాస్‌’ అనే ఇతివృత్తంతో ఈసారి కవాతులో పాల్గొనే శకటాలకు రూపకల్పన చేశారు. బ్రహ్మోస్‌, ఆకాశ్‌ క్షిపణులు, పినాక మల్టీబ్యారెల్‌ రాకెట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఎర్రకోట వరకు 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్‌ డే పరేడ్‌ ఏర్పాటు చేశారు. ఈ పరేడ్‌లో 31 శకటాలు ప్రదర్శించబడ్డాయి. వాటిలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర శాఖలు, యూటీలకు చెందిన శకటాలు ఉన్నాయి. 

Tags:    

Similar News