అమృత్‌సర్‌లో వరుస పేలుళ్లకు పాల్పడిన ఐదుగురు అరెస్ట్
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్, గోల్డెన్ టెంపుల్ సమీపంలో వారం వ్యవధిలో మూడు పేలుళ్లు సంభవించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ పేలుళ్లకు కారణమైన ఐదుగురిని అరెస్ట్ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్, గోల్డెన్ టెంపుల్ సమీపంలో వారం వ్యవధిలో మూడు పేలుళ్లు సంభవించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ పేలుళ్లకు కారణమైన ఐదుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన నిందితులు.. అజాద్వీర్ సింగ్, అమ్రీక్ సింగ్, సాహిబ్ సింగ్, హర్జీత్ సింగ్, ధర్మేంద్ర సింగ్‌లుగా పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ గుర్తించారు. నిందితుల్లో ముగ్గురు పేలుడు పదార్థాలను సేకరించారని, సాధారణంగా బాణాసంచా లో ఉపయోగించే రసాయనాలతో కూడిన 1.1 కిలోల తక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే అమృత్‌సర్‌లో శాంతికి బంగం కలిగించడమే వీరీ పెలుళ్ల కుట్ర ముఖ్య ఉద్దేశంగా అధికారులు పేర్కొన్నారు.