కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆకట్టుకున్న వృద్ధులు.. భారీ సంఖ్యలో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్లు

వృద్ధులు, తొలిసారి ఓటు హక్కును వినియోగించునే వాళ్లు బుధవారం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.

Update: 2023-05-10 12:34 GMT

బెంగళూరు: వృద్ధులు, తొలిసారి ఓటు హక్కును వినియోగించునే వాళ్లు బుధవారం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. తొలిసారి ఓటు వేసే వారి సంఖ్య చిన్నదేమీ కాదు. దాదాపు 11.71 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. తొలిసారి ఓటు హక్కును వినయోగించుకున్న యువతలో ఉత్కంఠ నెలకొంది. ‘నేను ఓటు వేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నా హక్కు’ అని వారంటున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడవంలో ప్రజల ఉదాసీనతకు ఈసీ చెక్ పెట్టింది. వారాంతంలో ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది పిక్నిక్‌లకు ప్లాన్ చేసుకుంటారు. దీనిని అరికట్టేందుకు వారం మధ్యలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ఆలోచించింది.

‘పోలింగ్ తేదీని కావాలనే బుధవారం నిర్ణయించాం. ఎందుకంటే సోమవారమయితే.. శని, ఆదివారాలు సెలవులు కాబట్టి సోమవారంతో కలిపి మూడు రోజులు సరదాగా బయటికి వెళ్లిరావచ్చని భావిస్తారు. మంగళవారమయితే.. సోమవారం ఒక్కరోజు సెలవు పెడితే సరదాగా తిరిగిరావచ్చు. అదే బుధవారం అయితే కొంచెం కష్టమవుతుంది’ అని ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు చెప్పారు.

ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఈసీ అనేక చర్యలు తీసుకుంది. 996 మహిళలు నిర్వహించే బూత్‌లను, 239 వికలాంగులు నిర్వహించే బూత్‌లను, 286 యువత నిర్వహించే బూత్‌లను ఏర్పాటు చేసినట్టు ఈసీ తెలిపింది. వయసు 80 సంవత్సరాలు పైబడి పోలింగ్ స్టేషన్‌కు రాలేకపోతున్న వారికి తొలిసారి ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని తొలిసారి ఈ ఎన్నికల్లో కల్పించారు. అయితే హసన్ జిల్లా హోలెనరసీపూర్ తాలూకా మేలగోడకు చెందిన శతాధిక వృద్ధురాలు బోరమ్మ మాత్రం చేతి కర్ర సాయంతో తన కుమారిడి చేయి పట్టుకుని పోలింగ్ బూత్‌కు వచ్చారు. చాలా మంది వృద్ధులు వీల్ చెయిర్‌పై పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. పెళ్లికొడుకు, పెళ్లికూతురు కూడా ఓటు వేసేందుకు క్యూలో నిలుచుకున్నారు. ట్రాన్స్‌జెండర్స్ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ అధికారి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

కర్ణాటక ఎన్నికల పోలింగ్ శాతం విడుదల చేసిన ఈసీ 

Tags:    

Similar News