Coaching Center : కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం.. పలువురి విద్యార్థుల పరిస్థితి విషమం

రాజస్తాన్(Rajasthan) లోని ఓ కోచింగ్‌ సెంటర్‌(Coaching Center)లో అగ్నిప్రమాదం(Fire Accident)లో వ్యాపించిన దట్టమైన పొగలతో ఊపిరాడక 12 మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు.

Update: 2024-12-16 11:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : రాజస్తాన్(Rajasthan) లోని ఓ కోచింగ్‌ సెంటర్‌(Coaching Center)లో అగ్నిప్రమాదం(Fire Accident)లో వ్యాపించిన దట్టమైన పొగలతో ఊపిరాడక 12 మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌(Jaipur)లో గోపాల్‌పూర్‌(Gopalpur)లోని ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్‌(Uthkarsh Coaching Center)లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగి, కోచింగ్ హాల్ లో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ ప్రాంగణంలోని తలుపులు, కిటికీలు మూసి ఉండటంతో... పొగకు ఊపిరాడక సుమారు 12 మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. యాజమాన్యం వారిని వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కోచింగ్‌ సెంటర్‌లో సుమారు 350 మంది విద్యార్థులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సోమవారం ఉదయం ఉత్కర్ష్ కోచింగ్ సెంటర్ వద్ద విద్యార్థులు, పేరెంట్స్‌ నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ కోచింగ్‌ సెంటర్‌ ఉన్న భవనాన్ని, పేయింగ్ గెస్ట్‌ హాస్టల్ ను జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్‌ చేశారు.

Tags:    

Similar News