కనికరం లేకుండా చిన్నారుల‌ను చిత‌క్కొట్టిన మ‌హిళా ఆఫీస‌ర్ (వీడియో)

ఇద్దరు చిన్నారుల‌పై ఓ మ‌హిళా ఉద్యోగి క్రూరత్వం ప్రదర్శించింది. జ‌ట్టు ప‌ట్టుకొని చిత‌క్కొడుతూ.. మంచంపై ఎత్తేసి హింసిస్తూ.. ఆ పిల్లలను చిత్రహింసలకు గురిచేసింది.

Update: 2023-06-05 12:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇద్దరు చిన్నారుల‌పై ఓ మ‌హిళా ఉద్యోగి క్రూరత్వం ప్రదర్శించింది. జ‌ట్టు ప‌ట్టుకొని చిత‌క్కొడుతూ.. మంచంపై ఎత్తేసి హింసిస్తూ.. ఆ పిల్లలను చిత్రహింసలకు గురిచేసింది. ఈ దారుణ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ కాంకేర్ జిల్లాలో వెలుగుచూసింది. అనాథ‌లైన 6 సంవ‌త్సరాలలోపు చిన్నారులకు కాంకేర్ జిల్లాలోని అడాప్షన్ సెంటర్‌లో ఆశ్రయం క‌ల్పిస్తున్నారు. అయితే అక్కడ ప‌నిచేసే ప్రోగ్రాం మేనేజ‌ర్ సీమా ద్వివేది చిన్నారుల ప‌ట్ల క్రూరంగా ప్రవ‌ర్తించారు. ఓ ఇద్దరు చిన్నారులను మాన‌సికంగా హింసించి.. జుట్టు ప‌ట్టుకుని చిత‌క్కొట్టింది. అనంత‌రం వారిని మంచంపై ఎత్తేసింది.

ఈ దారుణ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పిల్లల‌పై దాడి చేసిన స‌మ‌యంలో అటుగా వ‌చ్చిన ఇద్దరు ఉద్యోగులు కూడా ద్వివేదిని అడ్డుకోలేదు. అయితే తాజాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు కాంకేర్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. క‌లెక్టర్ డాక్టర్ ప్రియాంక శుక్లా సీరియ‌స్‌గా స్పందించారు. అడాప్షన్ సెంట‌ర్ ప్రోగ్రాం మేనేజ‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. గ‌తంలో ఆ సెంట‌ర్ ఉద్యోగులు సీమ ద్వివేది ప్రవ‌ర్తన బాగాలేద‌ని, మ‌హిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో సీమా ద్వివేదిపై జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Tags:    

Similar News