భార‌త ప్ర‌ధానికి ఆఫ్ఘాన్ అమ్మాయి లేఖ‌.. దాని కోసం రిక్వెస్ట్‌! (వీడియో)

5000 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు చిక్కుకుపోయారు. Afghan student, wrote to PM Narendra Modi regarding visa.

Update: 2022-08-20 07:59 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబాన్లు అధికారం చేప‌ట్టిన నాటి నుండి స్త్రీలపై తీవ్ర ఆంక్ష‌లు మ‌ర‌లా మొద‌ల‌య్యాయి. విద్యా, విజ్ఞానం, బ‌హిరంగ వ్య‌వ‌హారాల్లో మ‌హిళ‌ల ప్ర‌వేశాల‌కు దాదాపు నిషేధం విధించారు. ఈ క్ర‌మంలో ఆఫ్ఘనిస్తాన్‌లోని ఓ కళాశాల విద్యార్థిని ఫాతిమా భారతదేశంలో చదువుకోవడానికి వీసా అందుబాటులో లేదని, దానికి త‌గిన స‌హాయం చేయాల‌ని శుక్రవారం భార‌త‌ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఆ లేఖలో, "నేను, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన కాలేజీ అమ్మాయి ఫాతిమా. భారతదేశంలో చదువుకోవడానికి నాకు స్కాలర్‌షిప్ ఇవ్వాలని భారత ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము భారతదేశాన్ని ప్రేమిస్తున్నాము. అది మా కుటుంబం లాంటిది, "అని ఇండియా టుడే రికార్డ్ చేసిన వీడియోలో ఆమె పేర్కొంది.

భారతదేశంలో చదువుతున్న 5000 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు గత సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయారు. అయితే, వారికి వీసాలు అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల చదువును కొన‌సాగించ లేక‌పోతున్నారు. తాలిబాన్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తర్వాత, తమ విద్యను కొనసాగించడానికి వీసాల జారీ కోసం వేచి చూస్తున్నారు. కాగా, కొంతమంది విద్యార్థులు మే 2022లో కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల నిరసన వ్యక్తం చేయ‌గా, వారి విద్య కొనసాగించడానికి ఇ-వీసాలు జారీ చేయాలని భారత అధికారులను అభ్యర్థించారు.


Similar News