ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు 13 మంది స్పాట్ డెడ్..
మహారాష్ట్రలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. రాయ్‌గఢ్ జిల్లా ఖొపోలి సమాపంలో ఓ ట్రావెల్ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది.
దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సంప్రదాయ సంగీత కచేరీ బృందంతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. వీరంతా పుణేలోని పింప్రీ చించ్వాడ్ ప్రాంతంలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఖోపోలీ సమీపంలోని పాత ముంబై-పూణె ఎక్స్ ప్రెస్ వేలో ఈ ప్రమాదం సంభవించిందిస్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని భావిస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం క్షతగాత్రులకు ఉచితంగా వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.