కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు.. అధికారికంగా ప్రకటించిన ఫరూక్ అబ్దుల్లా
అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలిపాయి.
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలిపాయి. ఈ విషయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా గురువారం అధికారికంగా ప్రకటించారు. కాగా, జమ్మూ కాశ్మీర్‌లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి షాకిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమికి అవకాశం ఇవ్వొద్దని ఇండియా కూటమి పట్టుమీద ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి తొలగిస్తూ ఆర్టికల్ 360ని రద్దు చేసిన బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలని భావిస్తున్న ఇరు పార్టీలు పార్టీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి.