ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఫేక్: వెల్లడించిన రైల్వే శాఖ
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ పేరుతో వైరల్‌గా మారిన..... "False": Indian Railways Issues Clarification On Viral Job Notification
న్యూఢిల్లీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ పేరుతో వైరల్‌గా మారిన నోటిఫికేషన్‌పై కేంద్రం స్పందించింది. ఈ నోటిఫికేషన్ ఫేక్ అని శనివారం కొట్టిపారేసింది. తప్పుడు సమాచారం షేర్ అవుతుందనే వార్తల నడుమ రైల్వేస్ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. ‘ఆర్పీఎఫ్ లేదా రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లలో లేదా ఏదైనా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని తెలియజేస్తున్నాం’ అని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. కొన్ని రోజుల క్రితమే ఢిల్లీలో ఫేక్ నియామకాలను బట్టబయలు చేసిన అధికారులు తాజా ఫేక్ నోటిఫికేషన్ విషయంలో అప్రమత్తమయ్యారు.