ఢిల్లీ్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు: విద్యుత్ అధికారుల సంచలన నిర్ణయం
దేశంలో చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ డిమాండ్‌ను 5611 మెగావాట్ల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి పెంచినట్టు డిస్కమ్ అధికారులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా శీతాకాలపు గరిష్ట డిమాండ్ గత శుక్రవారం నాటికి 5559 మెగావాట్లుగా ఉందని వెల్లడించారు. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. కాగా, గత ఫ్రైడే ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా.. సోమవారం 5.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇప్పటివరకు ఈ నెలలో అత్యంత తక్కువగా నమోదు కావడం గమనార్హం.