ఆడపిల్లలకు పెళ్లి కానుకగా రూ.1,80,000.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
కేంద్ర ప్రభుత్వం పేదప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం పేదప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో కొత్త పథకాన్ని కూడా కేంద్రం అమలు చేసిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇంతకీ ఆ వార్త ఏంటంటే కేంద్రం నిరుపేదలకు వివాహ కానుకగా ప్రధానమంత్రి కన్యా ఆవీర్వాద్ యోజన పథకం అమలు చేసిందని, ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు రూ.1,80,000 నగదును అందజేస్తోందని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన pibFactCheck స్పందించి ఈ వార్త ఫేక్ వార్త అని తేల్చి చెప్పేసింది. ఇప్పటివరకు కేంద్రం అలాంటి పథకాన్ని అమలు చేయలేదని, ప్రజలు ఇలాంటి వార్తలు విని మొసపోవద్దని సూచించింది.