వైరల్ వీడియో : ప్రధాని మోడీపై బాలీవుడ్ సూపర్ స్టార్ ఆగ్రహం ?

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘దేశంలో నిత్యావసరాల ధరల మంటకు, నిరుద్యోగ సమస్యకు కారకులు ప్రధానమంత్రి నరేంద్రమోడీయే’’ అని హీరో రణ్‌వీర్‌సింగ్ విమర్శిస్తున్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Update: 2024-04-18 11:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘దేశంలో నిత్యావసరాల ధరల మంటకు, నిరుద్యోగ సమస్యకు కారకులు ప్రధానమంత్రి నరేంద్రమోడీయే’’ అని హీరో రణ్‌వీర్‌సింగ్ విమర్శిస్తున్నట్లుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తీరా ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఆ వీడియోలు ఫేక్ అని వెల్లడైంది. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వినియోగించి రణ్‌వీర్‌సింగ్ వాయిస్‌ను క్లోన్ చేశారని తేలింది. వాస్తవానికి ‘ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్’ (ఏఎన్ఐ) అనే వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీపై నటుడు రణ్‌వీర్‌సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని మోడీ నిలబెట్టారని కితాబిచ్చారు. ఈ ఇంటర్వ్యూ ఒరిజినల్ వీడియో 2 నిమిషాల 33 సెకన్ల నిడివితో ఉంది. అయితే ఫేక్ వీడియో నిడివి కేవలం 42 సెకన్లు ఉంది. ఇందులో వాయిస్‌ను క్లోన్ చేసి రణ్‌వీర్‌సింగ్‌తో అనరాని మాటలు అనిపించారు.

‘‘ దేశ ప్రజల బాధలకు, భయానికి నిరుద్యోగానికి, ద్రవ్యోల్బణానికి ప్రధాని మోడీయే కారకులు.మన భారతదేశం అనుభవిస్తున్న యాతనకు ఆయనే కారకులు. ఈ అన్యాయపు ఊబి నుంచి బయట పడేందుకు మనం న్యాయాన్ని కోరాలి. మనమంతా ఆలోచించి ఓటు వేయాలి. కాంగ్రెస్‌కు ఓటు వేయాలి’’ అని ఫేక్ వీడియోలో రణ్‌వీర్‌సింగ్ చెప్పారు. ఈ వ్యాఖ్యలకు అనుగుణంగా రణ్‌బీర్ మొహంలో హావభావాలు.. పెదవుల కదలిక.. గొంతులో సారూప్యత లేకపోవడంతో అది ఫేక్ వీడియో అని తేలిపోయింది. ఇలాంటి తప్పుడు వీడియోలను గుర్తించాల్సిన బాధ్యత నెటిజన్లపై ఉంది. 

Tags:    

Similar News