ఎక్స్‌టెండెడ్ రేంజ్ బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగం విజయవంతం..

భారత వైమానిక దళం బుధవారం గగనతలంలో ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి ఎక్స్‌టెండెడ్ రేంజ్ వేరియంట్‌ను విజయవంతంగా పరీక్షించింది.

Update: 2023-10-19 06:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారత వైమానిక దళం బుధవారం గగనతలంలో ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి ఎక్స్‌టెండెడ్ రేంజ్ వేరియంట్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి మునుపటి కంటే ఎక్కువ దూరం ఉన్న లక్ష్యాలను కూడా సునాయసంగా ఛేదిస్తుంది. క్షిపణి యొక్క ఎక్స్‌టెండెడ్ రేంజ్ వేరియంట్ ఫ్లైట్ సూపర్సోనిక్ వేగంతో గరిష్టంగా 400 నుంచి 500 కి.మీ పరిధిలో భూమి, సముద్ర లక్ష్యాలను ఛేదించగలదు. ఈ సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ.. సుకోహి-30MKI జెట్ దక్షిణ భారతదేశంలో ఉన్న ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరి క్షిపణి నుండి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడానికి దాదాపు 1,500 కి.మీ ప్రయాణించిందని వెల్లడించారు. ఇటీవలే భారత్-చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో తూర్పు లడఖ్‌లో బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన Su-30 MKI యుద్ధ విమానాలు మోహరించామని మాజీ ఐఏఎఫ్ చీఫ్ హైలైట్ గుర్తు చేశారు. 

Tags:    

Similar News