స్వాతి మలివాల్ బీజేపీలో చేరుతారా.. జేపీ నడ్డా రియాక్షన్ ఇదీ

స్వాతి మలివాల్ దాడి వివాదంపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పందించారు. కేజ్రీవాల్ ను నిర్భయ ఛాంపియన్ అన్న నడ్డా.. ఇప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

Update: 2024-05-19 18:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: స్వాతి మలివాల్ దాడి వివాదంపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పందించారు. కేజ్రీవాల్ ను నిర్భయ ఛాంపియన్ అన్న నడ్డా.. ఇప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. స్వాతి మలివాల్ బీజేపీ ఏజెంట్ అని ఆప్ చేసిన ఆరోపణలను అవాస్తవాలు అని కొట్టిపారేశారు.

ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వాతి మలివాల్ ను తానెప్పుడూ కలవలేదని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలు ఎవరూ స్వాతిని కలవలేదని స్పష్టం చేశారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ను బీజేపీలో చేర్చుకునే ఆలోచన కాషాయపార్టీకి లేదని పేర్కొన్నారు. స్వాతి మలివాల్ పై దాడి అనేది.. పూర్తిగా ఆప్ అంతర్గత విషయం అని నొక్కి చెప్పారు.

స్వాతి మలివాల్ కేసులో కేజ్రీవాల్, ఇండియా కూటమి లీడర్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఢిల్లీ ఓటర్ల ముందు కేజ్రీవాల్ విశ్వనీయత శూన్యంగా మిగిలిపోయిందన్నారు. ఆప్ అధినేత ఎప్పుడూ ద్వంద స్వభావాన్నే కలిగి ఉన్నారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ అసలు స్వరూపం ప్రజల ముందు బట్టబయలైందన్నారు.

నడ్డా మాట్లాడుతూ.. "కేజ్రీవాల్ లో ఫ్రస్ట్రేషన్ ఉంది. ప్రత్యేక హోదాపై స్వారీ చేస్తూ అధికారంలోకి వచ్చాడు. కానీ ప్రజల నుంచి ఆశినంత ఆయనకు లభించిందలేదు. ఇది ఆయన్ని నిరుత్సాహపరిచింది. వీటి నుండి తనను తాను రక్షించుకోవడానికి మీడియాను ఉపయోగించి డ్రామా చేస్తున్నాడు. బీజేపీని నిందించి, బీజేపీ కార్యాలయల వెలుపల నిరసనలు చేస్తున్నారు”. అని అన్నారు.

కేజ్రీవాల్ జైలుకు వెళ్లొద్దంటే ఆప్ కు ఓటేయాలని కోరడం సుప్రీం కోర్టుల బెయిల్ షరతుల ఉల్లంఘనే అని అన్నారు. అయితే, ఢిల్లీ ప్రజలు తెలివైన వారని.. మోడీని మూడోసారి గెలిపిస్తారని అన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కన్హయ్యపై జరిగిన దాడి గురించి నడ్డా ప్రస్తావించారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారియే దాడి చేయించారన్న కన్హయ్య వార్తలను కొట్టిపారేశారు. మనోజ్ తివారీకి పెరుగుతున్న ప్రజాదరణతోనే తనపై గూండాలతో దాడి చేయించుకున్నారని అన్నారు.


Similar News