మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం విషమం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం క్షీణించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం క్షీణించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం విషమంగా ఉన్నదని తెలిసింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను హాస్పిటల్ చేర్పించినట్టు ఆయన కార్యాలయం తెలిపింది. 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ ఏడాది తొలినాళ్లలోనే రాజ్యసభ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నారు.