సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్..
కర్ణాటక మాజీ డీజీపీ ప్రవీణ్ సూద్ గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ డీజీపీ ప్రవీణ్ సూద్ గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రవీణ్ 1986 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. మే 14వ తేదీన ఈయనను సీబీఐ డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్ జైస్వాల్ పదవీ కాలం మే 25న ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సమావేశపై ప్రవీణ్ సూద్‌ను సీబీఐ డైరెక్టర్‌గా ఎన్నుకున్నారు. ప్రవీణ్ 2013-14లో కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
అంతేకాకుండా స్టేట్ హోం డిపార్ట్‌మెంట్‌లో ప్రిన్సిపల్ సెక్రటరీగా, కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ విభాగంలో ఏడీజీపీగా, అడ్మినిస్ట్రేషన్‌లో ఏడీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రవీణ్ సూద్ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారని మార్చిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఆరోపించారు. ప్రవీణ్ కర్ణాటక పోలీసులకు సారథ్యం వహిస్తున్నప్పుడు కాంగ్రెస్ నేతలపై దాదాపు 25 కేసులు నమోదయ్యాయని.. బీజేపీ నేతలపై ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదని ఆయన చెప్పారు.