EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై సెటిల్‌మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లింపు..!

ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్(CBT) గుడ్‌న్యూస్ చెప్పింది.

Update: 2024-11-30 17:04 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్(CBT) గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి క్లెయిమ్ సెటిల్‌మెంట్(Claim Settlement) చేసే తేదీ వరకు చందాదారుడికి వడ్డీ(Interest) చెల్లించాలని నిర్ణయించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి(Central Labour Minister) మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya) నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన సీబీటీ 236వ మీటింగ్(CBT 236 Meeting)లో ఈ డెసిషన్ తీసుకున్నారు. కాగా ప్రస్తుతం ఈపీఎఫ్ సెటిల్‌మెంట్ చేసే సమయంలో ఆ నెల 24వ తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కించే విధానం అమలులో ఉంది. సీబీటీ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై సెటిల్‌మెంట్ తేదీ వరకు వడ్డీని చెల్లించనున్నారు. దీంతో ఖాతాదారుడికి ఆర్థికంగా ప్రయోజనం కలగడంతో పాటు ఫిర్యాదులు తగ్గుతాయని సీబీటీ అభిప్రాయపడింది.

Tags:    

Similar News