అలరించిన భారత్, జపాన్ సంయుక్త విన్యాసాలు

ఈనెల 8 నుంచి ఐదు రోజుల పాటు ఇండియన్ కోస్ట్ గార్డ్, జపాన్ కోస్ట్ గార్డ్‌లు చెన్నయ్‌లోని బంగాళాఖాతం సమీపంలో సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించాయి.

Update: 2024-01-13 04:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఈనెల 8 నుంచి ఐదు రోజుల పాటు ఇండియన్ కోస్ట్ గార్డ్, జపాన్ కోస్ట్ గార్డ్‌లు చెన్నయ్‌లోని బంగాళాఖాతం సమీపంలో సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించాయి. ఇరు దేశాల మధ్య 2006లో కుదిరిన మెమోరాండం ఆఫ్ కో ఆపరేషన్ ఒప్పందానికి అనుగుణంగా ఈ విన్యాసాలు చేపట్టాయి. ఇందులో రెండు కోస్ట్ గార్డ్ సంస్థల మధ్య పరస్పర చర్యను ప్రోత్సహించడానికి రెండు దేశాలు అంగీకరించాయి, రెండు సముద్ర భద్రతా ఏజెన్సీల మధ్య సంబంధాలు, పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేయడం, కమ్యూనికేషన్‌లో ఇంటర్‌ఆపరేబిలిటీని మెరుగుపరచడం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లను (ఎస్‌ఓపీ) బలోపేతం చేయడం, ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడం లక్ష్యంగా ఈ కసరత్తు నిర్వహించారు. కాగా, 2000 సంవత్సరంలో ప్రారంభమైనప్పటి నుంచి రెండు కోస్ట్ గార్డ్‌ల మధ్య నిర్వహించిన 20వ విన్యాసం ఇది. మరోవైపు కొనసాగుతున్న ఈ సహకారానికి గుర్తింపుగా జపాన్ కోస్ట్ గార్డ్ షిప్ ‘యాషిమా’ నాలుగు రోజుల సద్భావన పర్యటన నిమిత్తం జనవరి 10న చెన్నయ్‌కి చేరుకుంది. ఈ సందర్భంగా భారత తీర రక్షక దళం నౌకలతో విన్యాసాల్లో పాల్గొంది. 

Tags:    

Similar News