ఐదుసార్లు సమన్ల దాటవేత.. కేజ్రీవాల్‌పై కోర్టుకెక్కిన ఈడీ

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ పాలసీ స్కాం కేసులో విచారణ హాజరుకావాలని జారీ చేసిన ఐదు సమన్లను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాటవేయడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టును ఆశ్రయించింది.

Update: 2024-02-03 14:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ పాలసీ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ జారీ చేసిన ఐదు సమన్లను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాటవేయడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టును ఆశ్రయించింది. సమన్ల ఆదేశాలను బేఖాతరు చేసినందుకుగానూ ఐపీసీలోని 174 సెక్షన్, మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. ఈ కేసును కోర్టు ఫిబ్రవరి 7న విచారణకు స్వీకరించనుంది. 2023 సంవత్సరంలో నవంబర్ 2, డిసెంబర్ 21 తేదీల్లో.. ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. సమన్ల పేరుతో తనను అరెస్టు చేసేందుకు చట్టవిరుద్ధమైన ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతీసారి ఆరోపించిన కేజ్రీవాల్.. ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు.

Tags:    

Similar News