ఎలక్టోరల్ బాండ్స్ ఎఫెక్ట్.. ఎస్‌బీఐకి బిగ్ షాకిచ్చిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్స్‌ను వెబ్‌సైట్‌లో పొందుపర్చిన విషయం తెలిసిందే. SBI అందించిన బాండ్ల చిట్టాను గురువారం సాయంత్రం విప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్స్‌ను వెబ్‌సైట్‌లో పొందుపర్చిన విషయం తెలిసిందే. SBI అందించిన బాండ్ల చిట్టాను గురువారం సాయంత్రం విప్పింది.763 పేజీలతో డొనేషన్ వివరాలను అధికారిక వెబ్‌సైట్ eci.gov.in వేదికగా ఈసీ విడుదల చేసింది. దీని పరంగా ఏయే రాజకీయ పార్టీలకు ఎన్ని డొనేషన్స్ వచ్చాయి? వాటిని ఇచ్చిన వారెవరు? అనే కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
తాజాగా.. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. డేటా అసంపూర్తిగా ఉందని తెలిపింది. బాండ్స్ నెంబర్లను అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐకి నోటీసులు జారీ చేసింది. బాండ్స్ నెంబర్లు లేకపోవడంతో ఎవరు? ఎవరికి ఇచ్చారన్న విషయం తెలియదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై సోమవారం లోగా వివరణ ఇవ్వాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.