Rajya Sabha polls : మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు..

గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) మంగళవారం తెలిపింది.

Update: 2023-06-27 16:14 GMT

న్యూఢిల్లీ: గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) మంగళవారం తెలిపింది. గోవా నుంచి బీజేపీ సభ్యులు వినయ్ డి టెండూల్కర్, గుజరాత్ నుంచి విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జుగల్ సిన్హ్ లోఖండ్ వాలా, దినేష్ చంద్ర అనవాదియా, పశ్చిమ బెంగాల్ నుంచి టీఎంసీ నాయకుడు డెరెక్ ఓ బ్రెయిన్, డోలాసేన్, సుష్మితా దేవ్, శాంత ఛెత్రి, సుఖేందు శేఖర్ రే జూలై 28వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.

కాంగ్రెస్ సభ్యుడు ప్రదీప్ భట్టాచర్య పదవీ కాలం ఆగస్టు 18న పూర్తవుతుంది. వీరి స్థానాలకు జూలై 24వ తేదీన పోలింగ్ జరుగుతుందని, అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. ఏప్రిల్ 11వ తేదీన రాజీనామా చేసిన టీఎంసీ ఎంపీ లుయిజిన్హో జోక్విమ్ ఫలేరో స్థానానికి ఉప ఎన్నిక కూడా జూలై 24వ తేదీనే నిర్వహిస్తారు.


Similar News