ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం

2024 పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలో జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రకాలు చర్యలు ప్రారంభించింది.

Update: 2024-02-24 05:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలో జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రకాలు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థల వ్యయ పరిమితి పెంచినట్లు ECI తెలిపింది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్ఠంగా రూ. 95 లక్షలు ఖర్చు చేయవచ్చని స్పష్టం చేసింది. అలాగే ఒక్కో నియోజకవర్గంలో తిరిగే వాహనాల సంఖ్యను 5 నుండి 13కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు.. ఎస్సీ, ఎస్టీ లకు 12,500, ఇతరులు రూ. 25,000 చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుందని.. పేర్కొంది. అలాగే అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను.. ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాష తో పాటుగా.. హిందీ, ఇంగ్లీష్‌లో ఎన్నికల సంఘానికి సమర్పించాలని తెలిపింది.

Tags:    

Similar News