పెద్దావిడ అని కూడా చూడలేదీ దుర్మార్గుడు.. ఏం చేశాడో తెలిస్తే కోపం రావడం ఖాయం..!
పెద్దావిడ అని కూడా చూడకుండా ఓ యువకుడు దుర్మార్గంగా ప్రవర్తించాడు.
దిశ, వెబ్ డెస్క్: పెద్దావిడ అని కూడా చూడకుండా ఓ యువకుడు దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఆమెను కింద పడేసి ఇష్టమొచ్చినట్లు తన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాల్లియా జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో.. ఓ పెద్దావిడకు యువకుడికి మధ్య నీళ్ల విషయంలో వాగ్వివాదం జరిగింది. మంచి నీళ్ల ట్యాంక్ కు పైప్ తగిలించి విషయంలో పెద్దావిడతో యువకుడు గొడవ పెట్టుకున్నాడు.
ఆమెను ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా ముసలావిడను కిందపడేసి విచక్షిణ రహితంగా తన్నాడు. దీంతో ఆ పెద్దావిడ సొమ్మసిల్లి పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరిని అరెస్ట్ చేశారు. యువకుడిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను ఏం చేసినా పాపం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.