ఏక్‌నాథ్ షిండే శివసేన రాజ్యసభ అభ్యర్థి ఎవరో తెలుసా ?

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే‌కు చెందిన శివసేన (షిండే) వర్గం తమ రాజ్యసభ అభ్యర్థిగా మిలింద్ దేవరా పేరును ప్రకటించింది.

Update: 2024-02-14 11:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే‌కు చెందిన శివసేన (షిండే) వర్గం తమ రాజ్యసభ అభ్యర్థిగా మిలింద్ దేవరా పేరును ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీతో ఉన్న పాతికేళ్ల రాజకీయ బంధాన్ని తెంచుకొని ఇటీవల ఏక్‌నాథ్ షిండేతో మిలింద్ దేవరా చేతులు కలిపారు. ఆయన గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో పలుమార్లు దక్షిణ ముంబై లోక్‌సభ స్థానం నుంచి మిలింద్ దేవరా పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్) పొత్తులో భాగంగా దక్షిణ ముంబై లోక్‌సభ సీటు శివసేన (ఉద్ధవ్)కు దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ శివసేన (ఉద్ధవ్) నాయకుడే. ఈనేపథ్యంలో తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు దక్కకపోవచ్చనే అంచనాలతో మిలింద్ దేవరా కాంగ్రెస్ నుంచి ఏక్‌నాథ్ షిండే టీమ్‌లోకి జంపయ్యారు. భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న ఏక్‌నాథ్ షిండే వ్యూహాత్మకంగానే మిలింద్‌ను రాజ్యసభకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News