Delhi Liquor Scam: 3 వేల పేజీలతో ఈడీ ఫస్ట్ ఛార్జిషీట్..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ అంశాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి.

Update: 2022-11-26 10:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ అంశాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. ఈ కేసులో తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తొలి ఛార్జిషీట్ ఫైల్ దాఖలు చేసింది. 3 వేల పేజీలతో కూడిన చార్జిషీట్‌ను శనివారం ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టుకు సమర్పించారు. ఇప్పటి వరకు లిక్కర్ కేసులో ఈడీ బోయిన్‌పల్లి అభిషేక్, అరబిందో ఫార్మా పుల్ టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రు, వినయ్ బాబులను అరెస్టు చేసినట్టు పేర్కొంది. కాగా ఈ కేసులో శుక్రవారం సీబీఐ తన తొలి చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టుకు సమర్పించగా ఆ మరుసటి రోజే ఈడీ సైతం ఈ కేసులో ఫస్ట్ చార్జిషీట్ నమోదు చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది.

విజయ్ నాయర్‌కు 13 రోజుల జ్యుడీషియల్ కస్టడీ:

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో విజయ్ నాయర్‌కు రౌస్ అవెన్యూ కోర్టు 13 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. శనివారంతో విజయ్ నాయర్‌కు విధించిన ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. మనీలాండరింగ్ కేసులో విజయ్ నాయర్ పాత్ర ఉందని ఈ సందర్భంగా ఈడి అధికారులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో విజయ్ నాయర్ కు డిసెంబర్ 8 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కేసు విచారణ డిసెంబర్ 8 వాయిదా వేసింది. దీంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఈడీ జుడిషియల్ కస్టడీ ముగియడంతో సమీర్ మహేంద్రుని ఈడీ కోర్టులో హాజరుపరిచింది.

Tags:    

Similar News