ఈడీ, సీబీఐలను మూసేయాలి: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( సీబీఐ)లు అవసరం లేదని, వాటిని మూసేయాలని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.

Update: 2024-05-19 05:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( సీబీఐ)లు అవసరం లేదని, వాటిని మూసేయాలని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. ఇదే విషయాన్ని ఇండియా కూటమిలోనూ ప్రతిపాదిస్తానని తెలిపారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. సీబీఐ, ఈడీలు దేనికోసం అవసరమని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ ఉందని, ఒక వేళ ఏదైనా అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తే..దానిని ఉపయోగించాలని చెప్పారు. బీజేపీకి చెందిన రాజకీయ ప్రత్యర్థులపై మాత్రమే కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే ప్రభుత్వాలను పడగొట్టడానికి, ఏర్పాటు చేయడంలోనూ అవి కీలక పాత్ర పోషిస్తున్నాయని విమర్శించారు.

నోట్ల రద్దు సమయంలో జరిగిన అవకతవకలపై ఈడీ, సీబీఐలు ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. ఈ రెండు సంస్థలను ఉపయోగించి బీజేపీ దోపిడీకి పాల్పడిందని, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రద్దు అనంతరం ఈ విషయం స్పష్టంగా వెల్లడైందని నొక్కి చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మూసేసే ప్రతిపాదనను తప్పకుండా ఇండియా కూటమి ఉందు ఉంచుతానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దోపిడీ వ్యూహాలు రచించిందని, ఎన్నికల బాండ్లతో బీజేపీ చేసిన విధంగా మరెవరూ దోపిడీ చేయలేరన్నారు.

Tags:    

Similar News