Economic Survey 2024: 51.25 శాతం యువతకు మాత్రమే ఉపాధి పొందే నైపుణ్యం ఉంది
024 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఎకనామిక్ సర్వే సభలో ప్రవేశ పెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఎకనామిక్ సర్వే ను సభలో ప్రవేశ పెట్టారు. ఈ సర్వే ప్రకారం.. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభాలో అరవై ఐదు శాతం మంది 35 ఏళ్ల లోపు ఉన్నారు. ఇందులో దాదాపు సగం మందికి ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యాలు లేవని స్పష్టం చేసింది. దీని ప్రకారం.. దాదాపు 51.25 శాతం మంది యువత మాత్రమే ఉపాధి పొందగలరని అంచనాలు చెబుతున్నాయి. గత దశాబ్దంలో 34 శాతం ఉండగా.. ఇది ప్రస్తుతం 51.3 శాతానికి పెరిగిపోయింది. ఈ ఎకానమీ సర్వే ప్రకారం.. గ్రాడ్యూయేట్ అవుతున్న ప్రతి ఇద్దరిలో ఒక్కరు మాత్రమే నేరుగా ఉద్యోగం సాధించడానికి తగ్గ నైపుణ్యం కలిగి ఉండి ప్రయత్నాలు చేస్తున్నారని అర్థం.