Haryana Polls : ఉద్యోగ భర్తీ ఫలితాల విడుదలకు బ్రేక్.. ఈసీ ఆదేశం
దిశ, నేషనల్ బ్యూరో : హర్యానాలో అక్టోబరు 1న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘట్టం జరగబోతోంది.
దిశ, నేషనల్ బ్యూరో : హర్యానాలో అక్టోబరు 1న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఘట్టం జరగబోతోంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో ఇటీవలే జరిగిన వివిధ ఉద్యోగ భర్తీ పరీక్షల ఫలితాల విడుదలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయా ఫలితాలను విడుదల చేయరాదని ఈసీ స్పష్టం చేసింది.
హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ భర్తీ ప్రక్రియను ప్రారంభించడాన్ని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ నుంచి తమకు ఫిర్యాదు అందిందని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఇందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఏదీ లేదని, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి చాలా రోజులు ముందే ఉద్యోగ భర్తీ ప్రక్రియ మొదలైందని గుర్తుచేసింది.