ఎలక్షన్ కోడ్ వల్లే స్వేచ్ఛాయుత ఎన్నికలు.. లా కమిషన్‌కు స్పష్టం చేసిన ఈసీ

జమిలీ ఎన్నికల కోసం చేసిన రాజ్యంగ సవరణ బిల్లలో ఎన్నికల కోడ్‌పై అభ్యంతరం తెలుపుతూ చేసిన ప్రతిపాదనలను ఈసీ తిరస్కరించింది.

Update: 2025-01-12 14:06 GMT
ఎలక్షన్ కోడ్ వల్లే స్వేచ్ఛాయుత ఎన్నికలు.. లా కమిషన్‌కు స్పష్టం చేసిన ఈసీ
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో:

ఎలక్షన్ కోడ్ కారణంగా పాలనకు తరచుగా ఆటంకం కలుగుతుందని ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం తప్పుబట్టింది. జమిలీ ఎన్నికల కోసం చేసిన రాజ్యంగ సవరణ బిల్లలో ఎన్నికల కోడ్‌పై అభ్యంతరం తెలుపుతూ చేసిన ప్రతిపాదనలను ఈసీ తిరస్కరించింది. ఎలక్షన్ కోడ్ అమలు అయితేనే స్వేచ్ఛాయుతంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని ఈసీ పేర్కొంది. ఈ మేరకు జమిలీ ఎన్నికలపై తమ స్పందనను 2023 మార్చిలోనే లా కమిషన్‌కు ఈసీ లిఖిత పూర్వకంగా తెలియజేసింది. మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను క్రమబద్దీకరించడం వల్ల దీన్ని అమలు చేసే సమయం తగ్గుతుందని కూడా ఈసీ వెల్లడించింది. జమిలీ ఎన్నికల అంశంపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీకి గతంలోనే ఒక నివేదికను అందించింది. తరచూ ఎన్నికలు జరుగుతుండటం వల్ల ప్రతీ సారి ఎన్నికల కోడ్ అమలు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రభుత్వ పాలనకు ఆటంకం కలుగుతుంది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఏమి చేయవచ్చో పలు సూచనలను లా కమిషన్‌కు ఎన్నికల సంఘం తెలిపింది.

Tags:    

Similar News