దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు

దేశ రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది. ఆదివారం ఉదయం 11.23 గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి.

Update: 2023-05-28 07:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది. ఆదివారం ఉదయం 11.23 గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోను భూమి కంపించినట్లు అధికారులు గుర్తించారు. భూకంపం ప్రభావంతో జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌, పూంచ్‌, ఢిల్లీ, చండీగఢ్‌తోపాటు పంజాబ్, హర్యానాలోని చాలాప్రాంతాల్లో కొన్నిసెకన్ల పాటు భూమి కదిలిందని వెల్లడించారు. అయితే దీనివల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని చెప్పారు. ఇండియాస్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఆదివారం ఉదయం ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్ సమీపంలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 79 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఏజెన్సీ తెలిపింది. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 11:19 గంటలకు భూ ఉపరితలానికి 220 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొంది.

Tags:    

Similar News