ఢిల్లీ, చెన్నై, ఉత్తర్‌ప్రదేశ్, నేపాల్‌లో భూకంపం
దేశంలోని పలుచోట్ల భూప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం దేశ రాజధాని... Earthquake in Delhi, Chennai, Uttar Pradesh, Nepal
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోని పలుచోట్ల భూప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీతోపాటు చెన్నై, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యాణ, నేపాల్‌లో భూకంపం సంభవించింది. ఢిల్లీలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4 గా నమోదైంది. హరిద్వార్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. చెన్నైలోనూ భూప్రకంపనలు సంభవించాయి. మౌంట్ రోడ్, వైట్స్ రోడ్ లో కంపించిన భూమి కంపించింది. దీంతో భయబ్రాంతులకు గురైన జనాలు పరుగులు పెట్టారు. మరోవైపు నేపాల్‌లోని బజూరాలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భూప్రకంపనలు ఏర్పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
అయితే, ఈ భూకంపాల కారణంగా ఎటువంటి ఆస్థి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. కాగా, టర్కీ, సిరియాలో ఇటీవల సంభవించిన భూకంపం సృష్టించిన విలయం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. 40 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా మరెంతో మంది క్షతగాత్రులయ్యారు. అయితే, టర్కీ, సిరియా తరహాలోనే భారత్‌లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని NGRI చీఫ్ సైంటిస్ట్ డా.పూర్ణచంద్రరావు హెచ్చరించిన సంగతి తెలిసిందే. "భూమి పొరలలో ఉండే ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ క్రమంలో భారత్ భూభాగంలో కింద దాగి ఉన్న ప్లేట్ ప్రతి ఏడాది ఐదు సెంటీమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ పరిణామంతో హిమాలయాలపై ఒత్తిడి పెరిగి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో త్వరలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.