వైరల్ వీడియో : ఘోర నిర్లక్ష్యం.. ఈ-రిక్షా యూటర్న్.. బైకర్ బలి
దిశ, నేషనల్ బ్యూరో : డ్రైవింగ్‌లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా తోటి వాహనదారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.
దిశ, నేషనల్ బ్యూరో : డ్రైవింగ్‌లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా తోటి వాహనదారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. తాజాగా ఈ-రిక్షా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ద్విచక్రవాహనదారుడి నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ-రిక్షా డ్రైవర్ అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకోవడాన్ని గుర్తించిన ద్విచక్రవాహనదారుడు తన బైక్‌కు బ్రేక్ వేసేందుకు ఎంతో ప్రయత్నించాడు. అయితే బైక్ వేగంలో ఉండటంతో బ్రేక్ పడలేదు. సడెన్ బ్రేక్ కారణంగా బైక్ పైనుంచి పడిపోయి ద్విచక్రవాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు.
చనిపోయిన వ్యక్తిని 21 ఏళ్ల ఆకాశ్ సింగ్‌గా గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకున్న ప్రమాద ఘటనకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ-రిక్షా డ్రైవర్‌దే తప్పు అని సీసీటీవీ ఫుటేజీని బట్టి స్పష్టమైంది. ఈ-రిక్షా డ్రైవరుపై ఆకాశ్ సింగ్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ-రిక్షా డ్రైవర్‌ను అరెస్టు చేశారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు.