ఆయనది రాజవంశీయుల మనస్తత్వం: రాహుల్‌పై కేంద్ర మంత్రి ధ్వజం

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ధ్వజమెత్తారు.

Update: 2023-01-30 13:52 GMT

జమ్ము-కశ్మీర్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో లాల్ చౌక్ వద్ద మువ్వన్నెల జెండా కనిపించకుండా తన కటౌట్‌ను పెద్దగా పెట్టారని రాజీవ్ విమర్శించారు. ఇది రాహుల్ గాంధీ రాజవంశీయుల మనస్వత్వాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్ర చివరి రోజున రాహుల్ గాంధీ లాల్ చౌక్ వద్ద భారీ భద్రత మధ్య కాంగ్రెస్ నేతల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. కానీ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఆయన కటౌట్‌లు జాతీయ జెండా కంటే ఎత్తుగా ఉండటం ఫ్లాగ్ కోడ్‌ను ఉల్లంఘించడమే.

'మనం చెప్పుకుంటున్న ఈ నేత అందరూ ఊహించినట్టుగానే జాతీయ జెండాను ఆవిష్కరించారు. కానీ జెండా కంటే తన కటౌట్‌ను పెద్దగా పెట్టి ఫ్లాగ్ కోడ్‌ను ఉల్లంఘించడం చాలా దారుణం. ఇది ఒక విధంగా రాజవంశీయుల మనస్తత్వమని చెప్పాలి. జాతీయ జెండా కంటే ఆయన కటౌట్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది' అని మంత్రి రాజీవ్ అన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర సోమవారం శ్రీనగర్‌లో ముగిసింది. ఈ ముగింపు సభకు కొంత మంది ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. భారీగా మంచు కురుస్తున్నప్పటికీ రాహుల్ గాంధీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భారత్ జోడో యాత్రలో తనతో కలిసి నడిచిన యాత్రికులందరికి, తనపై ప్రజలు చూపిన ప్రేమకు, మద్దతుగా నిలిచిన వారికి రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు.


Tags:    

Similar News