ఢిల్లీలో బీభత్సం సృష్టించిన భారీ వర్షాలు.. విమానాల దారి మళ్లింపు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Update: 2023-05-27 04:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ఢిల్లీ తడిసి ముద్దవుతోంది. శనివారం ఉదయం కుండపోత వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. చెట్లు నేలకూలాయి. భారీ వర్షాల కారణంగా పలు విమానాలు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో నాలుగు విమానాలను జైపూర్ కు దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం ఉందని విమానాల సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత ఎయిర్ లైన్స్ ను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. మరో వైపు రాగల మూడు రోజులు ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది. గత వారం ఎండలకు అతలాకుతలమైన నగర వాసులకు తాజా వర్షాలు కాస్త ఉపశమనం ఇచ్చినప్పటికీ ఈదురు గాలులు ఇబ్బందిగా మారాయి. 

Tags:    

Similar News