Rajya Sabha: నన్ను 'జయా అమితాబ్ బచ్చన్' అని పిలవద్దు.. జయా బచ్చన్ ఆగ్రహం

తనని జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని, 'జయా అమితాబ్ బచ్చన్' అని పిలవాల్సిన అవసరం లేదని సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ అన్నారు.

Update: 2024-07-29 12:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తనని జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని 'జయా అమితాబ్ బచ్చన్' అని పిలవాల్సిన అవసరం లేదని సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ అన్నారు. రాజ్యసభ సమావేశాల్లో భాగంగా సోమవారం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ తన చైర్ నుంచి "జయ అమితాబ్ బచ్చన్" అని సంబోధించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె తనని జయా బచ్చన్ పిలిస్తే సరిపోతుందన్నారు. దీంతో జయా బచ్చన్ వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ చైర్మన్ 'పూర్తి పేరు ఇక్కడ రాసి ఉన్నందునే సంభోదించాల్సి వచ్చింది' అని బదులిచ్చారు. దీంతో మహిళలను భర్త పేరుతో మాత్రమే గుర్తిస్తారా? వారికి సొంత ఉనికి లేదా?, సొంతంగా విజయాలు సాధించట్లేదా? అని అసహనం వ్యక్తం చేశారు. కాగా బాలీవుడ్ లో చాలాకాలం పాటు పని చేసిన జయా బచ్చన్.. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి ఐదు సార్లు రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన ఆమె.. మహిళల హక్కులపై పార్లమెంట్‌లో నిరంతరం తన గళం వినిపిస్తుంటారు.

Tags:    

Similar News