Donald Trump:సెకండ్ టైం ప్రెసిడెంట్.. ట్రంప్ రికార్డులివే
నాలుగేళ్ల క్రితం జో బైడెన్ చేతిలో ఓడిపోయిన ట్రంప్ బుధవారం వెల్లడైన ఫలితాల్లో విక్టరీ సాధించి యూఎస్ఏ 47వ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.డెమొక్రట్ అభ్యర్థి కమలా హారిస్‌ను ఓడించడం ద్వారా 78 ఏళ్ల ట్రంప్ రెండో సారి అధ్యక్ష పదవి స్వీకరించనున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో : నాలుగేళ్ల క్రితం జో బైడెన్ చేతిలో ఓడిపోయిన ట్రంప్ బుధవారం వెల్లడైన ఫలితాల్లో విక్టరీ సాధించి యూఎస్ఏ 47వ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.డెమొక్రట్ అభ్యర్థి కమలా హారిస్‌ను ఓడించడం ద్వారా 78 ఏళ్ల ట్రంప్ రెండో సారి అధ్యక్ష పదవి స్వీకరించనున్నారు.
సెకండ్ టైం ఛార్జ్.. ఫస్ట్ టైం నమోదు కానున్న రికార్డులివే..!
- జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్న ట్రంప్ రెండు వేర్వేరు పర్యాయాలు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ తర్వాత ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తి కానున్నారు. గ్రోవర్ క్లీవ్ యూఎస్ఏకు 22, 24వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1885-89, 1893-97 మధ్య ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అయితే ట్రంప్ 2016 నుంచి 2020 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు.
- 20 ఏళ్ల తర్వాత తన ప్రత్యర్థి కన్నా అధిక ఓట్లు సాధించిన తొలి రిపబ్లికన్ అభ్యర్థిగా గుర్తింపు పొందారు. 2004లో జార్జ్ డబ్ల్యూ బుష్ 62,040,610 పాపులర్ ఓట్లు సాధించి 286 ఎలక్టొరల్ ఓట్లను డెమొక్రట్స్ అభ్యర్థి జాన్ కెర్రిపై సాధించారు. జాన్ కెర్రీ 59,028,444 ఓట్లతో 251 ఎలక్టోరల్ ఓట్లు సాధించాడు.
- అమెరికా చరిత్రలో పదవిలో ఉన్న సమయంలో అభిశంసన ఎదుర్కొన్న మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. అయితే సెనేట్ ఆయనను రెండు కేసుల్లో నిర్దోషిగా తేల్చింది.
- 34 నేరారోపణలు ఎదుర్కొంటూ పదవిలో కొనసాగునున్న మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ కొనసాగనున్ననారు. ఈ కేసులో నవంబర్ 26న తీర్పు వెలువడనుంది.